PAGE VIEWS

Friday, 26 December 2014

NICE TELUGU QUOTES AND SAYINGS BY AJAYKUMAR


                       NICE TELUGU QUOTES AND SAYINGS FROM MYSELF 

    
QUOTES ON MORALS:

   
1.మనం ఒకరి మీద జాలి పడే విదంగా తయారు అవ్వాలి.. కాని మన మీద ఒకరు జాలి పడే విదంగా తయారు అవ్వకూడదు..26/12/14

2. మన అనే భావన ఉన్న వారందరికీ తన అనే భావన ఉండదు అనేది ఎంత అవస్తవామో , తన అనే భావన ఉన్న వారందరికి మన అనే భావన ఉండదు అనేది కూడా అంతే అవాస్తవం..26/12/14

3. నీ కోపం వలన ఒక వ్యక్తి భాద పడతాడు , నీ స్వార్థం వలన ఒక వ్యక్తి ,ఒక కుటుంబం బాద పడుతుంది , కాని నీ వివక్ష (కుల, మత, జాతి ) వలన ఒక వ్యక్తి, ఒక కుటుంబం మరియు ఒక వ్యవస్థ (సమాజం) బాద పడుతుంది.. నీ కోపం నీ స్వార్ధం నీకు మాత్రమే సంబందించినవి, కానీ నీ వివక్ష అనేది సమాజానికి సంబందించినది.  (SOCIAL DISCRIMINATION IS THE ULTIMATE CAUSE FOR THE SOCIETY DISINTEGRATION) 26/12/14


4.విద్య అనేది తెలివికి ప్రామాణికం అయితే; పురాణాల కాలంలో విద్య(తెలివి) అనేది ఒకరి చేతిలో ఉండి వర్ణ వ్యవస్థ పుట్టుకొస్తే, మద్యయుగాల్లో విద్య(తెలివి) అనేది కొంత మంది చేతుల్లో ఉండి కులవ్యవస్థ పుట్టుకొస్తే,ఆదునిక కాలంలో విద్య అనేది అందరి చేతిలోకి వచ్చింది..మరి ఇప్పుడే వ్యవస్థ రావాలి? నిజమైన విలువలతో కూడిన మనిషి వ్యవస్థ, మానవ వ్యవస్థ రావాలి..కాని ఇప్పటికి మద్యయుగ కాలాల కుల జండాలతోనే దేశ రాజకీయ వ్యవస్థ,పాలన కొనసాగుతూ ఉండడం మన దురదృష్టం..26/12/14

5. నువ్వు పది మందిలో కలసిపోయి ఒకడిగా ఆలోచించడం కన్నా, నువ్వు ఒక్కడిగా ఉంటూ పది మందిలా  ఆలోచించడం మిన్న :)) 26/12/14

6.అన్నీ విజయాలు నిన్ను విజయుడు గా నిలబెడితే , కొన్ని ఓటములు మాత్రం నిన్ను దిగ్విజియున్ని చేస్తాయి..26/12/14

7. ప్రపంచం మొత్తం కటినంగా మారుతున్న కూడా, నువ్వు కటినంగా మారకు, ఎందుకంటే కటినగుణం అనేది వస్తువుల లక్షణం, కరుణ(జాలి,దయ)గుణం అనేది మనిషి లక్షణం..26/12/14

8.స్నేహం ఎప్పటికీ ఉన్నతమైనదే.. మారుతున్న ప్రపంచం మనుషులకు నేను అనే వాదాన్ని నేర్పింది, నేను అనే వాదం కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల నుంచి ఎన్నటికి ఉన్నతమైన స్నేహాన్ని ఆశించలేము..26/12/14

9. నీలో ఉన్న చెడు ను ప్రశ్నించే వారికి నువ్వు సిగ్గు పడాల్సిన అవసరం లేదు , కాని నీలో ఉన్న చెడు వలన ఇతరులు ఇబ్బంది పడుతున్నారు అని ప్రశ్నించే వారికీ మాత్రం కచ్చితంగ సిగ్గుపదల్సిందే..27/12/14

10. నీకు పాటం, నీకు గుణపాటం నేర్పేది కాలమే., కాలానుగుణంగా కష్టించి ముందుకు వెళితే నీ కలలు నెరవేరుతాయి, కాలాన్ని నిర్లక్ష్యం  చేస్తే కన్నీళ్ళు మిగులుతాయి..27/12/14 

11. సమాజం నీ గుణగణాలను ఒక కాలానికే ఆపాదించి చూస్తుంది, అది నీకు అనవసరం..నీ గుణగణాలను కాలానికి అనుగుణంగా సరిచేసుకుంటూ సమర్డుడుగా అవ్వడం ని బాధ్యత..10-02-15 


QUOTES ON PSYCHOLOGY:

 1.మంచి వాక్యాలు మాట్లాడే వారందరూ మంచి వారు అయి ఉండరు, చెడు వాక్యాలు మాట్లాడే వారందరూ చెడ్డ వారు అయి ఉండరు..27/12/14
   
2. అతి సున్నిత మనసుక్డు తో చేసిన స్నేహం, జారుడు బల్ల మీద ఉంచిన బంతి లాంటిది..27/12/14

3. నిన్ను గమనించే వాళ్ళు ఉండడం ని అదృష్టం, నిన్ను గమనించే వాళ్ళ గురించి నువ్వు పదే పదే ఆలోచించడం ని అవివేకం..28/12/14 

4. స్నేహం నీ జీవితం లో బాగం, బంధుత్వం కుడా నీ  జీవితం లోనే బాగమే , కాని ని జీవితమే దైవం లో బాగం , జీవితం లో బాగం అయిన వాటిని నీ హృదయం తో చూడు, దైవం లో బాగం అయిన వాటిని నీ ఆత్మ తో చూడు!! 31-12-14 

5. అతి సున్నిత మనస్కులు  అంటే చిన్న చిన్న విషయాలకు చెలించిపోయే వారు కాదు, చిన్న చిన్న
విషయాలకు చర్చలు పెట్టే వారు.. 9-3-15





 

 










No comments: